ఈ మొబైల్‌ ఉంటే ఇంట్లో థియేటర్‌ ఉన్నట్టే.. ధర ఎంత ఉండొచ్చంటే?

2 May, 2023 15:49 IST|Sakshi

ఇంట్లోనే థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ 

త్వరలో ఇండియన్‌ మార్కెట్‌లోకి ‘ప్రొజెక్టర్‌ మోడ్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లు’ 

స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో మరో విప్లవాత్మక టెక్నాలజీ 

బ్లూటూత్‌తో హోమ్‌ థియేటర్‌ అనుసంధానం 

శాంసంగ్‌ గెలాక్సీ బీమ్, లినోవాతో పాటు పలు కంపెనీలు తయారీ 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇంట్లోనే మనకు నచ్చిన స్క్రీన్‌ సైజులో థియేటర్‌ క్వాలిటీతో వీడియోలు, సినిమాలు వీక్షించొచ్చు. వీడియో కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న ‘ప్రొజెక్టర్‌ మోడ్‌ స్మార్ట్‌ ఫోన్ల’తో డిజిటల్‌ రంగం మరింత స్మార్ట్‌ కానుంది. చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే ఇంట్లో గోడలు.. నేల.. కార్యాలయం.. కార్లు.. విహార యాత్రలకు వెళితే ఆరు బయటి ప్రాంతాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ సెల్‌ఫోన్‌లోని ప్రొజెక్టర్‌ ద్వారా వీడియోలు చూడొచ్చు.

సెల్‌ఫోన్‌లో ప్రొజెక్టర్‌ ఇన్‌బిల్డ్‌ చేసి చైనా, జపాన్, అమెరికా, సౌత్‌ కొరియాకు చెందిన పలు కంపెనీలు వీటిని రూపొందించాయి. లినోవా, అక్యుమెన్, మోటో–జెడ్, మోవి, శాంసంగ్‌ బీమ్‌–2 మోడల్స్‌ పేరుతో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. త్వరలోనే ఇండియన్‌ మార్కెట్‌లోకి రానున్నాయి.  

థియేటర్‌ క్వాలిటీతో.. 
ఈ ఫోన్లలో ఇంటిగ్రేటెడ్‌ లేజర్‌ ప్రొజెక్టర్‌ ఉంటుంది. లినోవా కంపెనీ తొలుత దీన్ని రూపొందించగా.. ఆ తర్వాత ఇతర కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పుడు మార్కెట్‌లో ఈ ఫోన్ల ధర రూ.35 వేల నుంచి రూ.1.80 లక్షల వరకూ పలుకుతున్నాయి. ఫోన్, ప్రొజెక్టర్‌ క్వాలిటీ ఆధారంగా వీటి ధరలు ఉన్నాయి.

50 నుంచి 200 ఇంచుల స్క్రీన్‌ వరకూ మనం వీడియోలో ప్రొజెక్ట్‌ చేయొచ్చు. ఇందులో హెచ్‌డీ, ఫుల్‌ హెచ్‌డీ, 4కే క్వాలిటీతో వీడియోలు చూడొచ్చు.   హోమ్‌ థియేటర్‌ను బ్లూటూత్‌ ద్వారా కనెక్ట్‌ చేసి డీటీఎస్‌ సౌండ్‌తో పూర్తిగా థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌తో వీడియోలు చూడొచ్చు.  వీడియో ప్రజెంటేషన్‌కు ప్రొజెక్టర్ల అవసరం లేకుండా ఇలాంటి సెల్‌ఫోన్‌తో ప్రజెంటేషన్‌ చేయొచ్చు.  

మరిన్ని వార్తలు