ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఏపీకి అపార అవకాశాలు

5 Mar, 2023 04:35 IST|Sakshi

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తోడ్పాటు

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి

(విశాఖపట్నంలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి ) : ఆత్మనిర్భర్‌ భారత్‌ విధానంలో భాగంగా కేంద్రం 14 కీలక రంగాల్లో ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలను అమలు చే­స్తోం­దని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రా­నిక్స్, ఫార్మా, ఆహార ఉత్పత్తులు, వైద్య పరికరా­లు మొదలైనవి వీటిలో ఉన్నాయని చెప్పారు.

శనివారం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ..ఏపీకి ఉన్న సానుకూల­తల దృష్ట్యా మెరైన్‌ ఉత్పత్తులు, ఔషధాలు, ఎల­క్ట్రానిక్స్, పెట్రోలియం, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో వృద్ధి చెందడానికి రాష్ట్రానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నా­యన్నారు.  రా­ష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి తో­డ్పాటుపందిస్తుందని తెలిపారు. పెట్టు­బ­డులను ఆక­ర్షించడంలో, మౌలిక సదుపా­యాల కల్ప­నలో రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడు­తున్న నేపథ్యంలో ఈ తరహా సహకారం కీలకంగా ఉంటుందన్నారు.

2014లో 45 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు 2021–22 నాటికి రెట్టింపై 85 బిలియన్‌ డాలర్లకు చేరాయన్నారు. వ్యాపారాలను సులభతరం చేసే విధానాల్లో భారత్‌ ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగు­పర్చు­కుందన్నారు. పన్నుల విధానాల్లో, కార్పొరేట్‌ చట్టాల్లోనూ సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. యూనికార్న్‌ల (1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ గల అంకుర సంస్థలు)కు సంబంధించి ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు