దేశ రక్షణలో రాజీ లేదు

27 Jan, 2021 03:51 IST|Sakshi
నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఏకే జైన్‌

రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఏకే జైన్‌

సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళంలో గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తూర్పు నౌకాదళం నేవల్‌ బేస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్మ్‌డ్‌ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్‌ సెక్యూరిటీ సిబ్బంది, సబ్‌మెరైన్, యుద్ధనౌకల సిబ్బంది, సీ కేడెట్‌ కార్ప్స్‌ మార్చ్‌ పాస్ట్, రిపబ్లిక్‌ డే పరేడ్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా వైస్‌ అడ్మిరల్‌ జైన్‌ మాట్లాడుతూ విద్రోహుల్ని ఎదుర్కొనేందుకు నిరంతరం కృషిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశ తీర భద్రత విషయంలో అవసరమైన నౌకలు, సబ్‌మెరైన్‌లు, యుద్ధవిమానాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. భారత సముద్ర భాగంలో భద్రత పెంచేందుకు అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. రక్షణ విషయంలో నౌకాదళం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోవిడ్‌–19 సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన వారిని అభినందించారు. ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు