ముగిసిన మావుళ్లమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు

11 Feb, 2023 12:24 IST|Sakshi

భీమవరం(ప.గో.జిల్లా): సిరుల తల్లి.. కల్పవల్లి.. భీమవరం మావుళ్లమ్మవారి ఆలయ వార్షికోత్సవాలముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయంలో మహా నివేదన (మహా ప్రసాదం) సమర్పించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు చేయించారు.

అనంతరం జరిగిన అఖండ అన్నసమారాధనకు సుమారు 70 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. 29 రోజులపాటు అమ్మవారి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి.                     
 

మరిన్ని వార్తలు