విశాఖ ఉక్కుకు 3 జాతీయ ఇంధన అవార్డులు

28 Aug, 2021 21:38 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు మూడు జాతీయ స్థాయి ఇంధన అవార్డులు లభించాయి. సీఐఐ జీబీసీ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 27 వరకు ఇంధన నిర్వహణపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ అవార్డు, ఎక్స్‌లెంట్‌ ఎనర్జీ ఎఫిషియంట్‌ అవార్డు, ఇన్నోవేటివ్‌ ప్రాజెక్ట్‌ అవార్డులను ప్రకటించారు.

స్టీల్‌మెల్ట్‌ షాప్‌నకు చెందిన ఎల్‌డీ గ్యాస్‌ హోల్డర్‌ 1, 2కు చెందిన ప్రాజెక్టుకు ఇన్నోవేటివ్‌ అవార్డు, ఇంధన నిర్వహణలో చూపిన ప్రతిభకు ఎక్స్‌లెంట్‌ ఎనర్జీ ఎఫిషియంట్‌ అవార్డును ఇవ్వనున్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ అవార్డు వరుసగా నాలుగేళ్లు లభించడం విశేషం. త్వరలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీ డీకే మహంతి ఉద్యోగులను అభినందించారు.  

ఇవీ చదవండి:
కొత్త రకం మోసం: ఫిట్స్‌ వచ్చిన వాడిలా నటిస్తాడు.. ఆ తర్వాత..
ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఏం చేసిందో చెప్పగలదా?

మరిన్ని వార్తలు