మూడు రాజధానులు ఎందుకు వద్దంటున్నారు?.. అమరావతి యాత్రలో ఊహించని షాక్‌

15 Sep, 2022 13:20 IST|Sakshi

సాక్షి, గుంటూరు: అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్న వాళ్లకు ఊహించని షాక్‌ తగిలింది. యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటూ.. ఉమ్మడి గుంటూరులోని చాలా చోట్ల వ్యతిరేక ఫ్లెక్సీలు వాళ్లకు స్వాగతం పలికాయి. 

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇవాళ ఆ యాత్ర సాగనుంది. అయితే.. రాత్రికి రాత్రే జంపని, వేమూరు ప్రాంతాల్లో కారుమూరు వెంకటరెడ్డి పేరిట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ అందులో హైలైట్‌ చేసి ఉంది. మూడు రాజధానుల వల్ల కలిగే ఉపయోగాలు, అభివృద్ధిని పూసగుచ్చినట్లు వివరిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 

మరోసారి హైదరాబాద్‌లాగా దెబ్బ తినకూడదనే ఉద్దేశంతోనే.. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆ అభివృద్ధి అన్ని ప్రాంతాలకు అందుతుందని ఆ ఫ్లెక్సీ ద్వారా యాత్ర చేసేవాళ్లకు అర్థం అయ్యేలా వివరించింది ఉంది. అంతేకాదు అసలు మీ యాత్ర ఎందుకంటే వేసిన ప్రశ్నతో..  యాత్ర చేసే వాళ్లు కంగుతిన్నారు. స్థానికంగా వీటి గురించి చర్చ నడుస్తోంది.

ఇదీ చదవండి: పేదలంతా కళ్యాణమస్తు వినియోగించుకోండి

మరిన్ని వార్తలు