కెమికల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. ముగ్గురి మృతి

11 May, 2021 11:00 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: వింజమూరు మండలం చండ్రపడియాలో విషాదం చోటు చేసుకుంది. చండ్రపడియాలోని కెమికల్‌ ఫ్యాక్టరీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ లీకై ముగ్గురు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ కెమికల్‌ ఫ్యాక్టరీలో గతంలోనూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

 

చదవండి: ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం
మామిళ్లపల్లి పేలుడు కేసులో ఇద్దరి అరెస్ట్‌

మరిన్ని వార్తలు