ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

6 Aug, 2023 10:11 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా విషాదం చోటుచేసుకుంది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద బ్రిడ్జిపై నుంచి ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు.  ఏపీ 39 హెచ్ఆర్0907 నెంబర్ గల బలేనో కారు ఏజెన్సీ మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది.

వివరాలు.. జిల్లాకు చెందిన 10 మంది స్నేహితులు రెండు కార్లలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లారు.  రుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఓ కారు నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. స్థానికంగా ఉండే పాత, కొత్త వంతెనల మధ్యలోని కాల్వలో పడింది.

ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు మృతిచెందారు. మృతులను  ఉదయ్‌ కిరణ్‌, హర్ష వర్ధన్‌, హేమంత్‌గా గుర్తించారు. గాయపడిన మిగతా ముగ్గురిని రాజమంత్రి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మరణించిన ముగ్గురు యువకులు ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్‌ కాలేజీలో బీ టెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు