Uppada: మత్స్యకారుల వలకు ‘బాహుబలి’

26 Dec, 2021 10:44 IST|Sakshi

కాకినాడ రూరల్‌(తూర్పుగోదావరి): బంగాళాఖాతం సముద్ర జలాల్లో తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారుల వలకు బాహుబలి చేప చిక్కింది. కంబాల టేకుగా పిలిచే ఈ చేప సుమారు 2 మీటర్ల పొడవు, 4 మీటర్ల మేర వెడల్పు ఉంది. బరువు సుమారు 300 కేజీలు. దీనిని అతి కష్టంపై బోటు నుంచి క్రేన్‌తో ఆటో పైకి ఎక్కించి, కాకినాడకు తరలించారు. అర డజను మంది మత్స్యకారులు తాళ్ల సాయంతో కిందకు దింపి విక్రయించగా వెంకన్న అనే వ్యాపారి రూ.16,500కు కొనుగోలు చేశాడు.
చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు

మరిన్ని వార్తలు