రథంపై సింహాలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు

17 Sep, 2020 13:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి రథం మీద ఉన్న మూడు వెండి సింహాలు మాయమైన విషయంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ఈవో సురేష్‌ బాబు.. గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనులు నిమిత్తం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్లు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు సింహాలు అపహారణ మాయంపై విచారణ ప్రారంభించారు. (‘హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది’)

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని ఇంద్రకీలాద్రి ఆయల ఛైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఘాట్‌‌రోడ్‌లో ఉన్న రథాన్ని జమ్మిదిడ్డి లో పెట్టినట్లు, ఆ తరవాత మహామండపం దగ్గరకు తీసుకొచ్చి పెట్టారని గుర్తుచేశారు. 2019 లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉగాదికి వాడిన తర్వాత కరోనా వలన వాడలేదని స్పష్టం చేశారు. అప్పుడు ఏ రకంగా వాడిన తరవాత పట్టా కట్టి ఉంచారో ఇప్పటికి అలాగే ఉంచామన్నారు. 

నిన్న(బుధవారం) కనపడని సింహాలు స్టోర్ట్‌రూమ్‌లో ఉన్నాయో లేవో అని గుడి తాలూకా అధికారులు అందరూ తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ సింహాలు స్టోర్‌‌రూమ్‌లో లేవన్నారు. పోయిన సింహాలను తయారు చేసి ఆ రథానికి అమర్చే ప్రక్రియను బుధవారమే ప్రారంభించమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సెక్యురిటి అధికారులు ఇప్పుడు వచ్చిన మాక్స్ సెక్యురిటి వాళ్ళకి ఆ సింహాలు అప్పజెప్పలేదని తెలిపారు. ఈ రోజు సింహాలు కనపడకుండా పోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు..

ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆయల ఛైర్మన్‌ సోమినాయుడు మాట్లాడుతూ.. ‘పోయిన సింహాలు ఏరకంగా పోయాయి అని పోలీసులను దర్యాప్తు చేయాలి అని కోరాం. హిందువుల మనోభావాలు కాపాడేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని మాట్లాడారు. గత టీడీపీ-బీజేపీ హయాంలో దేవాలయంలో క్షుద్రపూజలు జరిగినప్పుడు అప్పటి మీ దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేశారా?. గత టీడీపీ హయాంలో సుమారు 40 దేవాలయాలు కులగొట్టినప్పుడు ఆ రోజు జనసేన నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు. 

ఒక ఎమ్మెల్సీ మాట్లాడేటప్పుడు మర్యాద కూడా లేకుండా మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు బుద్ధ వెంకన్న.  విచారణలో దోషులు తేలితే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాము. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో తప్పులు జరిగాయి అప్పుడు ఎన్ని సారులు మీ మంత్రులతో రాజీనామా చేయించావు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని వదంతులు చేసిన ప్రజలకు సీఎం వైఎస్‌ జనగ్‌పై అపార నమ్మకం ఉంది.’ అన్నారు.

2018 తరవాత ఇంద్రకీలాద్రి రథాన్ని తీయలేదని దుర్గగుడి ఈవో సురేష్‌బాబు పేర్కొన్నారు. ‘స్టోర్ రూమ్ తాళాలు నా దగ్గర ఉండవు. అక్కడ లేవు కాబట్టి స్టోర్ రూమ్‌లో సింహాలు ఉంటాయి అనే ఉద్దేశంతో నిన్న పరిశీలించాము. కానీ అక్కడ సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశాము.’ అన్నారు.

మరిన్ని వార్తలు