కరోనా కల్లోలం: ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

9 May, 2021 08:43 IST|Sakshi
సలాది లక్ష్మి

అమలాపురం: కరోనా రక్కసి ఆ కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలతో పాటు కుటుంబ పెద్దను పొట్టన పెట్టుకుంది. ‘సాక్షి’ ఉప్పలగుప్తం మండల విలేకరిగా పని చేస్తున్న సలాది నాగబాబు గత శనివారం కరోనాతో మృతి చెందారు. ఆయన సోదరుడు సలాది కృష్ణారావు శుక్రవారం ఉదయం కోవిడ్‌తో మృత్యువాత పడ్డారు.

అదే రోజు రాత్రి కృష్ణారావు భార్య సలాది లక్ష్మి (40) కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. కృష్ణారావుతో పాటు కరోనా బారిన పడిన ఆమె తొలుత ఇంటి వద్ద, తరువాత బోడసకుర్రు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందారు. భార్యాభర్తల పరిస్థితి విషమించడంతో బుధవారం వారిని కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. కళ్ల ముందే భర్త మరణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మృత్యువాత పడింది.

చదవండి: సాక్షి ఎఫెక్ట్‌: కరోనా చీకట్లో మానవత్వపు చిరు దీపం
విదేశాల నుంచి ఆక్సిజన్‌ కొనుగోలు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు