హమ్మయ్య.. ప్రాణాలతో తీరానికి..

16 Nov, 2020 09:00 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: గాజువాక ప్రాంతంలోని యారాడలో సముద్ర తీరంలో చిక్కుకున్న ముగ్గురు యువకులు చావు అంచుల నుంచి తప్పించుకున్నారు. ఆటవిడుపుగా యారాడకు వచ్చిన ఏడుగురు యువకులు అలల తాకిడికి తీరంలోని పిట్ల కొండ వద్ద రాళ్లలో చిక్కుకున్నారు. వారిలో నలుగురు యువకులు బయపడగా.. మిగతా ముగ్గురు మాత్రం అక్కడి నుంచి రాలేకపోయారు. తమ మిత్రులు ప్రమాదంలో చిక్కుకున్నారని యువకులు న్యూ పోర్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు .. రెవెన్యూ, రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో అధికార యంత్రాంగం యువకులను రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో నగరానికి చెందిన కొండ నవీన్ (20), భీశెట్టి యశ్వంత్ (20), కె.శ్రవణ్ (20) ను రక్షించించారు. యువకులు క్షేమంగా బయటపడటంతో అధికారులు, కుటుంబ సభ్యులు, వారి మిత్రులు ఊపిరిపీల్చుకున్నారు.  

మరిన్ని వార్తలు