పులినే చంపగల శునకం.. ఖరీదులో కనకం...

5 Dec, 2022 12:19 IST|Sakshi

సాక్షి, అనంతపురం:  టిబెటియన్‌ మస్టిఫ్‌.. టిబెట్‌ దేశానికి చెందిన ప్రత్యేక శునకం. ఇది చలి ప్రాంతాల్లోనే జీవించే అరుదైన జాతి కుక్క. తెలివైన, బలమైన, రక్షణ కల్పించే జాగిలంగా ప్రసిద్ధి. సాధారణంగా 15 ఏళ్లు జీవిస్తుంది. గరిష్టంగా 65 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే ఈ జాతి శునకానికి అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంది. దీని కోసం శునక ప్రియులు రూ.లక్షలు వెచ్చిస్తుంటారు. మస్టిఫ్‌ జాతి శునకం అనంతపురం సాయి నగర్‌ ఒకటో క్రాస్‌లో ఉండడం విశేషం.

బుక్కచెర్ల నల్లపరెడ్డి నివాసంలో ఉండే ఈ జాగిలం పలువురిని ఆకర్షిస్తోంది. అతిశీతల ప్రాంతం నుంచి వచ్చిన కుక్క అయినప్పటికీ, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడింది. రోజుకో కేజీ చికెన్‌ లాగించేస్తూ హాయిగా జీవిస్తోంది. పూర్తిగా ఏసీ గదుల్లోనే సేద తీరుతోంది. ఏకంగా పులినే చంపగల శక్తిశాలి అయిన మస్టిఫ్‌.. ఎవరి మీదా దాడి చేయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికి పాస్‌పోర్టు కూడా ఉండడం విశేషం. వీసాపై దీన్ని ఇక్కడికి తెప్పించారు. చిన్న పిల్లగా ఉన్నప్పుడు తెచ్చుకుని పెంచుకుంటున్నారు. 
(చదవండి: అనంతలో ఎల్లో కుట్రలు.. ఆ ఇద్దరే 22 కేసులు వేశారు)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు