మళ్లీ పులి దాడి

3 Jun, 2022 06:20 IST|Sakshi

కాకినాడ జిల్లా ఒమ్మంగిలో ఆవుపై దాడి 

ప్రత్తిపాడు రూరల్‌: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో బుధవారం రాత్రి పులి ఆవుపై దాడి చేసి హతమార్చింది. గ్రామంలోని రామిశెట్టి వెంకటేశ్వరరావుకు చెందిన ఆవుపై సరుగుడు తోటలో పులి దాడి చేసి తినేసింది. పులి జాడ కోసం గత మూడు రోజులుగా అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

పాండవులపాలెం చెల్లయ్యమ్మ చెరువులో పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు విస్తృతంగా గాలించినా ఫలితం లేకపోయింది. కాగా, బుధవారం రాత్రి మళ్లీ దాడి చేయడంతో డీఎఫ్‌వో ఐకేవీ రాజు, వైల్డ్‌ లైఫ్‌ డీఎఫ్‌వో సెల్వం, సబ్‌ డీఎఫ్‌వో సౌజన్య, రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, వైల్డ్‌ లైఫ్‌ రేంజర్‌ వరప్రసాద్, డీఆర్‌వో రామకృష్ణ, సెక్షన్‌ ఆఫీసర్‌ నాయక్‌ సారథ్యంలో అటవీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఇదిలా ఉండగా పులిని దారి మళ్లించడంలో అపార అనుభవం ఉన్న అధికారుల బృందం శ్రీశైలం ఫారెస్ట్‌ నుంచి ప్రత్తిపాడుకు వస్తున్నట్లు స్థానిక అధికారులు చెప్పారు.  

మరిన్ని వార్తలు