బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌.. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జాం

21 Apr, 2023 07:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ: గొల్లపూడి వద్ద ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది.

బస్సు బోల్తా పడటంతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్రేన్ సహాయంతో బస్సును అధికారులు తొలగించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు?

మరిన్ని వార్తలు