సాక్షి, తిరుమల: ప్రతి ఏటా శరన్నవరాత్రుల సందర్భంగా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. వైభవంగా ధ్వజారోహణం జరిగింది. దీనిలో భాగంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు ధ్వజపటం ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. నేటి రాత్రి(గురువారం) పెద్దశేష వాహన సేవ ఉండనుంది.