తితిదే: శ్రీవారి ఉచిత దర్శనానికి  18 గంటల సమయం

31 May, 2023 07:57 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ గత రెండ్రోజులతో పోల్చితే కొద్ది మేర తగ్గింది. టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి(ఉచిత) 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. 

నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 75,871 మంది దర్శించుకున్నారు. అదే సమయంలో 32,859 మంది తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం లభించింది.

🙏 అప్పలాయగుంటలో నేటి నుంచి  ప్రసన్న వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. మిధున లగ్నంలో ధ్వజారోహణం తో ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలు. నేటి నుంచి జూన్ 8 వరకు వైభవంగా జరగనున్నాయి అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలు.

🙏 నారాయణవనం శ్రీపద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం తో ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుంచి జూన్ 8 వరకు నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

మరిన్ని వార్తలు