రోజుకు 3 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

28 Jul, 2021 16:07 IST|Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెంచింది. కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి దర్శనాల సంఖ్య గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. నాలుగు నెలల పాటు 5 వేల టికెట్లు మాత్రమే టికెట్లు కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే ఉచిత దర్శనాలు పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో బుధవారం (జూలై 28) నుంచి రోజుకు 3 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది.

ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 30 వరకు రోజు మూడు వేలు టికెట్లు పెంచడంతో దాదాపు లక్షా పది వేల టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే బుధవారం ఉదయం 11 గంటలకు అన్‌లైన్‌లో విడుదల కావాల్సిన ఈ టికెట్లు సాంకేతిక కారణాలతో ఆగిపోయాయి. సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తడంతో దర్శన టికెట్లు అందుబాటులోకి రాలేదు. టీటీడీ అధికారులు సమస్యను పరిష్కరించారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.

మరిన్ని వార్తలు