తిరుపతి రుయాలో దారుణం.. రెచ్చిపోతున్న అంబులెన్స్‌ దందా..

26 Apr, 2022 11:38 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా రెచ్చిపోతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడి జెసవ కిడ్నీ చెడిపోవడంతో చిన్న పిల్లలు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మంగళవారం తెల్లవారు జామున ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో జెసవ మృతదేహాన్ని తలించెందుకు రాజంపేట నుంచి ఉచిత అంబులెన్స్ పంపిస్తే.. రుయా ఆస్పత్రిలోకి రాకుండా అంబులెన్స్ మాఫియా అడ్డుకుంది.

దీంతో ద్విచక్ర వాహనంపై జెసవ మృతదేహాన్ని తరలించారు. సిండికేట్‌గా మారిన అంబులెన్స్‌ మాఫియా.. బాలుడి మృత దేహాన్ని తరలించడానికి రూ.20 వేలు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

రుయా అంబులెన్స్ దందాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని జాల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ వార్త కూడా చదవండి: AP: రేపే టెన్త్‌ పరీక్షలు

మరిన్ని వార్తలు