ధ్వజారోహణం.. సకల దేవతలకు ఆహ్వానం

28 Sep, 2022 09:12 IST|Sakshi

సాక్షి, తిరుమల: విశ్వపతి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ఆరంభమయ్యాయి. ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకావిష్కరణతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. సకల దేవతలు, అష్టదిక్పాలకులు తొమ్మిది రోజులూ సప్తగిరి క్షేత్రంలో ఉంటూ ఉత్సవాలను తిలకించి తన్మయత్వం పొందుతారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
చదవండి:  నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌ 

ధ్వజారోహణానికి ముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప, పరివార దేవతలైన ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.

మరిన్ని వార్తలు