తిరుపతి అభ్యర్థిపై బీజేపీ–జనసేన సుదీర్ఘ మంతనాలు

26 Jan, 2021 03:39 IST|Sakshi

మరోసారి చర్చించాకే ‘తిరుపతి’ అభ్యర్థిపై నిర్ణయం 

బీజేపీ–జనసేన నేతల భేటీ అసంపూర్ణం 

సాక్షి, అమరావతి: తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ, జనసేన పార్టీల నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి మధుకర్‌ ఆదివారం రాత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. సుమారు 3 గంటల పాటు వీరి మంతనాలు సాగాయి. అభ్యర్థి ఎంపికపై ఇంకో దఫా చర్చలు జరపాలని నిర్ణయించారు. చదవండి: (కరోనా పీడలో ఎన్నికల పంచాయతీ!)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు