ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

1 Jun, 2023 20:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం ఎల్లకటవ గ్రామంలో బాణసంచా గోడౌన్‌ ప్రమాదం ఘటనలో ముగ్గురు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

బాణా సంచా గోడౌన్‌లో ప్రమాదంలో మరణించిన వారంతా చాలా పేదవాళ్లని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రోజువారీ కూలీలని సమాచారం తెలుసుకున్న సీఎం.. వెంటనే స్పందించారు. ఆయా కుటుంబాలను ఆదుకునేలా ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే ఎక్స్‌గ్రేషియాను వారి కుటుంబాలకు అందించాలన్నారు.
చదవండి: ఏపీలో హై అలర్ట్‌.. రాబోయే ఐదు రోజులూ అప్రమత్తంగా ఉండాల్సిందే..! 

మరిన్ని వార్తలు