తిరుపతి ఉప ఎన్నిక.. లైవ్‌ అప్‌డేట్స్‌

17 Apr, 2021 21:28 IST|Sakshi

TIME 7:00PM

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్‌ ముగిసింది. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 55% పోలింగ్‌ నమోదైంది. మే 2న కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది.

TIME 5:00PM

తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికకు పోలింగ్‌ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 54.99% పోలింగ్‌ నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే..
► సర్వేపల్లి నియోజకవర్గంలో 57.91% పోలింగ్‌
► గూడూరు నియోజకవర్గంలో 51.82% పోలింగ్
► సూళ్లూరుపేట నియోజకవర్గంలో 60.11% పోలింగ్
► వెంకటగిరి నియోజకవర్గంలో 55.88% పోలింగ్
► తిరుపతి నియోజకవర్గంలో 45.84% పోలింగ్
► శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 57% పోలింగ్
► సత్యవేడు నియోజకవర్గంలో 58.45% పోలింగ్‌

మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42% పోలింగ్‌ నమోదైంది. సత్యవేడు నియోజకవర్గంలో 52.68% పోలింగ్‌ నమోదైంది. వెంకటగిరి నియోజకవర్గంలో 45.25% పోలింగ్, తిరుపతి నియోజకవర్గంలో 38.75% పోలింగ్ నమోదైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 49.82% పోలింగ్, సర్వేపల్లి నియోజకవర్గంలో 46.98% పోలింగ్‌ జరిగింది. గూడూరు నియోజకవర్గంలో 49.82%, సూళ్లూరుపేట నియోజకవర్గంలో 50.68% పోలింగ్ నమోదైంది. 

TIME 3:00PM
తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికకు పోలింగ్‌ కొనసాగుతోంది. మ.3 గంటల వరకు సత్యవేడు నియోజకవర్గంలో 52.68 శాతం పోలింగ్‌ నమోదైంది. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 38.1 శాతం. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 40.76 శాతం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 35 శాతం. తిరుపతి నియోజకవర్గ పరిధిలో 32.1 శాతం. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 32.9 శాతం పోలింగ్‌ నమోదైంది.

TIME 1:37 PM
తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.67 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల  అధికారులు పేర్కొన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 38.1 శాతం
గూడూరు నియోజకవర్గ పరిధిలో 36.84 శాతం
సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 40.76 శాతం
వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 35 శాతం
తిరుపతి నియోజకవర్గ పరిధిలో 24 శాతం
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 35 శాతం
సత్యవేడు  నియోజకవర్గ పరిధిలో 36 శాతం

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు..
తిరుమల దర్శనం కోసం ప్రైవేట్ బస్సుల్లో వచ్చిన భక్తులను టీడీపీ అడ్డుకుంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దొంగ ఓటర్లంటూ ఆందోళన చేస్తూ ఓటర్లను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

TIME 12:44 PM


మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన పోలింగ్‌
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 27 శాతం
గూడూరు నియోజకవర్గ పరిధిలో 24.5 శాతం
సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 25 శాతం
వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 35 శాతం
తిరుపతి నియోజకవర్గ పరిధిలో 24 శాతం
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 26.2 శాతం
సత్యవేడు  నియోజకవర్గ పరిధిలో 22.6 శాతం

TIME 12:14 PM
ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్ నమోదైంది. ప్రశాంతంగా పోలింగ్‌ కొనసాగుతోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ మైన భద్రత ఏర్పాటు చేశారు.‌

TIME 10:59 AM
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి
నెల్లూరు: పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పక్రియ జరుగుతోందన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల పరిధిలో సర్వేపల్లి  నియోజకవర్గం నుంచి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

TIME 10:04 AM
ఉదయం 9 గంటల వరకు 7.8 శాతం పోలింగ్ నమోదు..
తిరుపతి ఉపఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 7.8 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద  ఓటర్లు క్యూ కట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ మైన భద్రత ఏర్పాటు చేశారు.‌

పోలింగ్‌ శాతం ఇలా..
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 11.35 శాతం 
గూడూరు నియోజకవర్గ పరిధిలో 3.49 శాతం
సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 9.40 శాతం
వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 8 శాతం
తిరుపతి నియోజకవర్గ పరిధిలో 6.5 శాతం
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 8.30 శాతం
సత్యవేడు  నియోజకవర్గ పరిధిలో 8.0 శాతం

TIME 9:20 AM
సత్యవేడు పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ..
సత్యవేడు పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ సెందిల్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలానికి ఒక డిఎస్పీ, 4 సీఐలు, 8 మంది ఎస్‌ఐలతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. అనుమానం ఉన్న వ్యక్తులను ముందుగానే అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ‌ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

TIME 9:13 AM
మొరాయించిన ఈవీఎంలు..
నెల్లూరు: గూడూరులోని 47,48,49 కేంద్రాల్లోని సాంకేతిక లోపంతో ఈవీఎంలు మొరాయించాయి. అగ్రహారం పుత్తూరులో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాదలూరులో కిలివేటి సంజీవయ్య ఓటు వేశారు.

TIME 8:41 AM
పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిమూలం
సత్యవేడులో పోలింగ్‌ బూత్ వద్ద  ఓటర్లు క్యూ కట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ మైన భద్రత ఏర్పాటు చేశారు. మూడు ప్రదేశాలలో ఈవీఎంలు మొరాయించాయి. వాటిని మార్చి అధికారులు పోలింగ్‌ ప్రారంభించారు. సత్యవేడు పోలింగ్‌ బూత్‌ను ఎమ్మెల్యే ఆదిమూలం పరిశీలించారు.

TIME 8:06 AM
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డా.గురుమూర్తి
శ్రీకాళహస్తిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మన్నసముద్రంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డా.గురుమూర్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలం ఓటు వేశారు. సత్యవేడులో రెండు ఈవీఎంలలో సాంకేతిక లోపం గుర్తించి అధికారులు సరిచేశారు. ఇప్పంతాంగాలు, తిరుమట్టియం కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.

ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగి గుండెపోటుతో మృతి
నెల్లూరు: ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. చిట్టమూరు మండలం అరవపాలెం దళితవాడ పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

TIME 7:56 AM
ఉపఎన్నికలో టీడీపీ హైడ్రామా
దొంగ ఓటర్లు వచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హల్‌చల్‌ చేశారు. అనుకూల మీడియాను తీసుకుని పీఎల్ఆర్ ఫంక్షన్‌ హాల్ వద్ద హడావుడి చేశారు. ఫంక్షన్‌ హాల్ సిబ్బందిని కూడా ఎందుకున్నారంటూ ప్రశ్నించారు. తిరుమలకు వచ్చే భక్తులను కూడా సుగుణమ్మ అడ్డుకున్నారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీస్తున్నారు.

TIME 7:00 AM
తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. కోవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలున్న ఓటర్లు ఓటు వేయడానికి సాయంత్రం ఆరు గంటల నుంచి అనుమతిస్తారు. గతంలో ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ ఉండగా క్యూలైన్లలో ఒత్తిడిని తగ్గించడానికి ఇప్పుడు ప్రతి 1,000 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న 28 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 17,11,195 మంది ఓటర్లు తేల్చనున్నారు.

ఈ ఎన్నికలను అమరావతి సచివాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షిస్తామని, ఇందుకోసం అదనపు సిబ్బందిని నియమించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్‌ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించడానికి 23 కంపెనీల కేంద్ర బలగాలు, 37 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించినట్లు చెప్పారు. ఈ ఎన్నికలను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. దినేష్పాటిల్‌ సాధారణ అబ్జర్వర్‌గా, రాజీవ్‌కుమార్‌ పోలీసు అబ్జర్వర్‌గా, ఆనందకుమార్‌ ఎన్నికల వ్యయ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. వీరికి అదనంగా 816 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా ఓటువేసే విధంగా ఏర్పాట్లు చేశామని విజయానంద్‌ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరారు. 

మరిన్ని వార్తలు