తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌

2 May, 2021 19:17 IST|Sakshi

Time: 4:04 PM
విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దు..
విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులను వైఎస్సార్‌సీపీ ఆదేశించింది. కోవిడ్‌ నిబంధనలు, ఈసీ సూచనల మేరకు సంబరాలు చేయొద్దని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. 

వైఎస్సార్‌సీపీ భారీ విజయం
Time: 3:47 PM
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించింది. 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందారు. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది.

Time: 3:10 PM
2 లక్షల 25 వేలు దాటిన వైఎస్సార్‌సీపీ మెజార్టీ..
వైఎస్సార్‌సీపీ మెజార్టీ 2 లక్షల 25 వేలు దాటింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు  2,25,773 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు.

Time: 2:48 PM
తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల  శాతం ఇలా..
వైఎస్సార్‌సీపీ- 4,61,366(57 శాతం)
టీడీపీ- 2,55,271 (31.5 శాతం)
బీజేపీ-43,317 (5.4 శాతం)
కాంగ్రెస్- 7,233(0.9 శాతం)
సీపీఎం- 4,232 (0.6 శాతం)
ఇతరులు- 26,316 (3.3 శాతం)
నోటా-11,509 (1.4 శాతం)

Time: 2:42 PM
వైఎస్సార్‌సీపీ మెజార్టీ 2.12 లక్షలు దాటింది. ఇప్పటివరకు 2,12,227 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు. వైఎస్సార్‌సీపీకి 4,47,819, టీడీపీకి 2,47,408, బీజేపీకి 42,334 ఓట్లు పోలయ్యాయి.

Time: 2:06 PM
లక్షా 50 వేలు దాటిన వైఎస్సార్‌సీపీ మెజార్టీ..
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ మెజార్టీ లక్షా 81 వేలు దాటింది. ఇప్పటివరకు 1,81,570 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల శాతం ఇలా..
వైఎస్సార్‌సీపీ- 2,96,678 (56 శాతం)
టీడీపీ-1,70,547 (32.2 శాతం)
బీజేపీ- 30,519 (5.8 శాతం)
కాంగ్రెస్‌- 4,821 (0.9 శాతం)
సీపీఎం- 2,949(0.6 శాతం)
ఇతరులు- 16,777 (3.2 శాతం)
నోటా- 7,202(1.4 శాతం)

Time: 1:50 PM
లక్ష పైగా ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఓట్ల సునామీ సృష్టిస్తోంది. 1,42,614 ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ దూసుకెళ్తోంది. టీడీపీ, బీజేపీ వెనుకంజలో ఉన్నాయి.

Time: 1:07 PM
95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్న వైఎస్సార్‌సీపీ..
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. గురుమూర్తికి 2,29,424 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 23,223 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌కు 3,594 ఓట్లు పోలయ్యాయి.

Time: 12:05 PM
వైఎస్సార్‌సీపీకి తిరుగులేని ఆధిక్యత..
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

Time: 10:42 AM
వైఎస్సార్‌సీపీకి భారీ ఆధిక్యం..
తిరుపతి: వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 76,202 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ 57.22 శాతం ఓట్లు సాధించింది.

Time: 9:51 AM
భారీ ఆధిక్యం దిశగా వైఎస్సార్‌సీపీ ముందజలో కొనసాగుతోంది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌ మొదటి రౌండ్‌లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో​ 1907 ఆధిక్యంలో ఉంది.

తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
Time: 8:53 AM
తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది.

Time: 8:22 AM 
పోస్టల్ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తారు.


Time: 8:05 AM 
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్‌ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో కౌంటింగ్‌ ఏర్పాట్లు చేశారు.

కౌంటింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్‌–19 నెగెటివ్‌ రిపోర్ట్‌ చూపించాలని, లేదా వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకున్నట్లు చూపించినవారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని విజయానంద్‌ స్పష్టం చేశారు.

ఇద్దరు ఏజెంట్లలో ఒక ఏజెంట్‌ పీపీఈ కిట్‌ విధిగా ధరించాలని చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి మొ బైల్‌ ఫోన్స్‌ అనుమతించరు. అత్యల్పంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గ కౌంటింగ్‌ 14 రౌండ్లు, సుళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌం డ్లు కౌంటింగ్‌ జరగనుంది. ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా లేదా ఓట ర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

కౌంటింగ్‌ దృష్ట్యా మే 1 అర్ధరాత్రి నుంచి మే 3 ఉదయం 10 గంటల వరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. గెలిచిన అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకునేటప్పుడు అభ్యర్థితో పాటు ఇద్దరు వ్యక్తులను మించి అనుమతించరు. అలాగే ఫలితాల తర్వాత ఎటువంటి ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు