టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

18 Jan, 2021 10:13 IST|Sakshi

ప్రతి ఇంటికీ 4 ఎల్‌ఈడీ బల్బులు
ఒక్కో బల్బు రూ.10 చొప్పున అత్యధిక సామర్థ్యం గల నాలుగు ఎల్‌ఈడీ బల్బులను విద్యుత్‌ శాఖ ప్రతి ఇంటికి అందించనుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) ‘గ్రామ ఉజాలా’ పథకాన్ని అందుబాటులోకి తెస్తోందన్నారు. పూర్తి వివరాలు..

ఇది నకిలీ ‘టీఎస్‌–బీపాస్‌’

భవనాలు, లేఅవుట్లకు ఆన్‌లైన్‌లో అనుమతుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక టీఎస్‌–బీపాస్‌ పోర్టల్‌ (https:// tsbpass. tela ngana.gov.in)ను పోలినట్లుగా ఓ నకిలీ పోర్టల్‌ పుట్టుకొచ్చింది. గూగుల్‌లో ‘టీఎస్‌బీపాస్‌’అని సెర్చ్‌ చేస్తే ఒరిజినల్‌ పోర్టల్‌ కిందనే నకిలీ పోర్టల్‌  (http://10061994. xyz/ tsbpass2/ index. html) సైతం కనపడుతోంది. పూర్తి వివరాలు..

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌కు కేంద్రం షాక్‌

సోషల్‌ మీడియాలో ప్రధానంగా ఉన్న ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దుర్వినియోగంపై సమన్లు జారీ చేసి ఈనెల 21వ తేదీన తమ ముందుకు హాజరుకావాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమన్లు పంపించింది. ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు అందించిన ఆధారాలతో పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులు.. పూర్తి వివరాలు..


అద్దె పిల్లలతో అతిథుల్లా వచ్చి.. ఆపై​​​​​​​

దొంగతనాల్లో వీరి స్టైలే వేరు. అతిథుల్లా వచ్చి అద్దె పిల్లలతో భారీ చోరీ చేస్తుంటారు. ఇదే తరహాలో ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో 35 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ కేసు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని మూడు గ్రామాలు ఈ తరహా దొంగలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తేలింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతోపాటు చోరీసొత్తును రికవరీ చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాలు..​​​​​​​

బైడెన్‌ బృందంలో 20 మంది ఇండో అమెరికన్లు

అమెరికా అధ్యక్షుడిగా మరో రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోతున్న జో బైడెన్‌ బృందంలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యమైన పదవుల్లో బైడెన్‌ ఇప్పటికే కనీసం 20 మంది ఇండో అమెరికన్లను నియమించారు. వారిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అలాగే, వైట్‌హౌజ్‌ నుంచి బాధ్యతలు నిర్వహించే శక్తిమంతమైన బైడెన్‌ పాలన బృందంలో 17 మంది భారతీయ అమెరికన్లు కీలకంగా వ్యవహరించనున్నారు. పూర్తి వివరాలు..​​​​​​​


ప్రేమ పెళ్లి అంత వీజీ కాదు​​​​​​​

కాజోల్‌ తాజా సినిమా ‘త్రిభంగ’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ఫ్యామిలీ అనుబంధాలలోని సవాళ్లను ఈ సినిమా చర్చిస్తూ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ‘త్రిభంగ’ అనేది ఒడిస్సీ నృత్యంలో ఒక భంగమ. దానిని కచ్చితంగా ఎవరూ పెట్టలేరు.. అయినా ఒక అందం ఉంటుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ఫ్రమోషన్‌లో కాజోల్‌ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో అనుబంధాలన్నీ అందరి ఇష్టాల కచ్చితత్వంతో ఉండవని అంది.  పూర్తి వివరాలు..​​​​​​​

గదుల్లో ఎలుకలు, నాణ్యతలేని ఆహారం​​​​​​​

సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు వచ్చి క్వారంటైన్‌లో చిక్కుకుపోయిన విదేశీ టెన్నిస్‌ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గదుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఒకరు పేర్కొనగా, తమకు అందిస్తున్న భోజనం సరిగా లేదని మరో ప్లేయర్‌ వాపోయాడు. శనివారం మెల్‌బోర్న్‌కు ప్లేయర్లను తీసుకొచ్చిన విమానాల్లో నలుగురికి కరోనా పాజిటివ్‌ ఫలితం రావడంతో అందులో ప్రయాణించిన 47 మంది ఆటగాళ్లను కఠిన క్వారంటైన్‌కు తరలించారు. పూర్తి వివరాలు..​​​​​​​


రూ.1,000 కోట్లతో స్టార్టప్‌ సీడ్‌ ఫండ్‌

 వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌లకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్రం మరో విడత ప్రత్యేక నిధిని ప్రకటించింది. రూ.1,000 కోట్లతో ‘స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేస్తున్నట్టు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘స్టార్టప్‌ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ ప్రారంభం సందర్భంగా వెల్లడించారు. 2016లో మోదీ సర్కారు స్టార్టప్‌ ఇండియా అంతర్జాతీయ సదస్సును ఆరంభించగా.. ఇది ఈ ఏడాదితో ఐదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. పూర్తి వివరాలు..​​​​​​​


ఎవర్‌గ్రీన్‌ ఫార్మర్‌!

ప్రకృతి వ్యవసాయం వైపు పయనించేలా యువ రైతులను ఒప్పించడమే సులువు, పెద్దలకు నచ్చజెప్పటం కష్టం అనే అభిప్రాయం ఒకటుంది. అయితే, ఒంటరి మహిళా రైతు తిరుపతమ్మ అనుభవం అందుకు భిన్నమైనది. అలవాటు లేని ప్రకృతి వ్యవసాయాన్ని ముదిమి వయసులో కూడా శ్రద్ధగా నేర్చుకొని, అనుసరిస్తున్నారు. స్వతంత్రంగా జీవిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారామె.  పూర్తి వివరాలు..​​​​​​​
​​​​​​​

20 రోజుల్లోపే ఇంటి నిర్మాణం పూర్తి

 ‘నవరత్నాలు–అందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం నుంచి స్థలం పొందిన లబ్ధిదారు కేవలం 20 రోజుల్లోపే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఆదివారం గృహప్రవేశం చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఆ ఇంటిని ప్రారంభించగా.. లబ్ధిదారు సంప్రదాయబద్ధంగా ఇంట్లోకి ప్రవేశించారు. పూర్తి వివరాలు..​​​​​​​

మరిన్ని వార్తలు