టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

22 Jan, 2021 08:07 IST|Sakshi

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూల్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గురువారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమే అవుతుందని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. పూర్తి వివరాలు..

అగ్ర కుల పేదలకు శుభవార్త..
అగ్ర కుల పేదలకు శుభవార్త. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 2–3 రోజుల్లోనే దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయనున్నట్లు గురువారం తెలిపారు. దీనితో రాష్ట్రంలో సైతం విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్‌ అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు..

శశికళకు కరోనా
జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆమెను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి ఐసీయూకి మార్చారు. ‘‘ప్రస్తుతం ఆమెకు కోవిడ్‌ 19 సోకింది. ఇతర ఏ అనారోగ్యాలు లేవు. ఆమె ఆక్సిజన్‌ స్థాయిలు 98 శాతంగా ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తోంది’’అని ఆస్పత్రి సూపరిండెంట్‌ రమేశ్‌ కృష్ణ చెప్పారు. ఆమెను మరో వారం పదిరోజుల అనంతరమే డిశ్చార్జ్‌ చేయవచ్చన్నారు. పూర్తి వివరాలు..

వరుస పేలుళ్లతో వణికిన బాగ్దాద్‌
రెండు ఆత్మాహుతి బాంబు దాడులతో గురువారం ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ వణికి పోయింది. సెంట్రల్‌ బాగ్దాద్‌లోని నిత్యం రద్దీగా ఉండే ‘బాబ్‌ అల్‌ షార్కి’లో జరిగిన ఈ రెండు వరుస పేలుళ్లలో కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయాల పాలయ్యారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రుల దేహాలతో ఘటనాస్థలి హృదయవిదారకంగా మారింది. పూర్తి వివరాలు..

పదవులు కాదు.. పార్టీ శాశ్వతం: కేటీఆర్‌
‘పదవులు ఎవరికీ శాశ్వతం కాదు. పార్టీ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. పార్టీ ఉంటేనే ఎవరికైనా పదవులు వస్తా యి. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ఏవైనా మంచి ఫలితాలు సాధించాలి. రాజకీయ పార్టీలో అంతర్గత విభేదాలు సహజం. వాటిని సామరస్యం గా పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి. పూర్తి వివరాలు..

భారీ పేలుడు: శరీరాలు ఛిద్రమై ఎగిరిపడ్డాయి
కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలో ఉన్న అబ్బలగెరి తాలూకా హుణసోడు గ్రామంలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తాజా సమాచారం అందే సమయానికి ఎనిమిది మృతదేహాలు వెలుగుచూశాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి భూమి తీవ్రంగా కంపించింది. భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు..

క్రేజీ ఛాన్స్‌
‘గ్యాంగ్‌ లీడర్‌’ భామ ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ క్రేజీ ఛాన్స్‌ కొట్టేశారని కోలీవుడ్‌ టాక్‌. సూర్యతో జోడీ కట్టే అవకాశం ప్రియాంక కొట్టేశారన్నది ఆ వార్త. పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్‌ అయ్యారు సూర్య. ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమట. పూర్తి వివరాలు..​​​​​​​

క్వార్టర్స్‌లో సింధు​​​​​​​
ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.  భారత స్టార్‌ షట్లర్‌ 21–10, 21–12తో కిసొనా సెల్వడ్యురె (మలేసియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ... డెన్మార్క్‌ ఆటగాడు రస్మస్‌ గెంకెను వరుస గేముల్లో 21–12, 21–9తో చిత్తు చేసి క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. పూర్తి వివరాలు..​​​​​​​

10 కోట్ల మందికి ‘హీరో’​​​​​​​
ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ గొప్ప రికార్డు సృష్టించింది. కంపెనీ ప్రారంభమైన 1984 నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 కోట్ల ద్విచక్ర వాహనాలను తయారు చేసి మరో మైలురాయిని అధిగమించింది. భారత్‌ నుంచి ఈ రికార్డు సాధించిన తొలి వాహన కంపెనీగా పేరు దక్కించుకుంది. పూర్తి వివరాలు..​​​​​​​
​​​​​​​

​​​​​​​ఒక ఫైటర్‌ ఒక టాపర్‌​​​​​​​
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి రాజ్‌పథ్‌ మీదుగా ఇండియా గేట్‌ వరకు ఎనిమిది కి.మీ. దూరం సాగవలసిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఈ ఏడాది మునుపటంత సందడితో ఉండబోవడం లేదు. ఎప్పుడూ లక్షమంది వరకు వీక్షకులను అనుమతించేవారు. ఈ ఏడాది ఆ సంఖ్యను ఇరవై ఐదు వేలకు కుదించారు. ఆ ఇరవై ఐదు వేల మందిలో నాలుగు వేల మంది మాత్రమే సాధారణ ప్రజలు. మిగతావారంతా వి.ఐ.పి.లు, వి.వి.ఐ.పీలు. ఎప్పుడూ చిన్నాపెద్దా అందరూ పరేడ్‌ను చూడ్డానికి వచ్చేవారు. పూర్తి వివరాలు..​​​​​​​

మరిన్ని వార్తలు