టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

6 Jan, 2021 07:49 IST|Sakshi

విద్వేషకారులను వదలొద్దు
రాజకీయ దురుద్దేశాలతో గుళ్లలో విధ్వంసాలు జరుగుతున్నాయి. ఎవరూ లేని ప్రదేశాల్లో, అర్ధరాత్రి పూట, అందరూ పడుకున్నాక, తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లోని గుడులపై దాడులు చేస్తున్నారు. వాటిలోని విగ్రహాలను పగలగొడుతున్నారు. ఆ మర్నాడు వాటిని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి మీడియా సంస్థలు వాటిని అదే పనిగా ప్రసారం చేస్తున్నాయి. పూర్తి వివరాలు..

వెయిట్‌ అండ్‌ సీ... ఆచితూచి టీపీసీసీ

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ’పట్టు‘విడుపులు లేని నాయకుల పంతా లతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలలో ఎవరో ఒకరిని ఈ పదవి వరిస్తుందనే చర్చ నిన్నటి వరకు జరగ్గా, ఇప్పుడు అనూహ్యంగా మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. పూర్తి వివరాలు..

దేశంలో కొత్త విపత్తు 

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ ఫ్లూ) వైరస్‌ తీవ్ర కలకలం రేపుతోంది. పక్షులకు ప్రాణాంతకమైన ఈ హెచ్‌5ఎన్‌1 వైరస్‌ కారణంగా రాజస్తాన్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో వివిధ రకాల పక్షులు చనిపోతున్నాయి.  పూర్తి వివరాలు..

బ్రిటన్‌లో ఫిబ్రవరి వరకు లాక్‌డౌన్‌

యూకేలో కరోనా కొత్త స్టెయిన్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసులు పెరిగిపోతూ ఆస్పత్రులపై ఒత్తిడి అధికం కావడంతో ప్రభుత్వం బుధవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇల్లు కదిలి బయటకు రావద్దని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి మధ్య వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. పూర్తి వివరాలు..

ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయి

ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఒక పథకం ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దివాలా తీసిన టీడీపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఉన్మాద స్థితిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. పూర్తి వివరాలు..

నేనేనా శూర్పణఖ!

రెజీనా పరిశోధనలో ఉన్నారు. ఈ పరిశోధన దేని గురించి అంటే? ప్రస్తుతానికి సస్పెన్స్‌. తాజా చిత్రం ‘నేనేనా’లో ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళంలో ‘శూర్పణగై’ (శూర్పణఖ) అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. మరి.. సినిమాలో శూర్పణగై రెజీనానేనా? లేదా వేరే ఎవరైనానా అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు..

ఓపెనర్‌గానే రోహిత్‌ శర్మ!

 ఫిట్‌నెస్‌ సంతరించుకొని... క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తుదిజట్టులో స్థానం ఖరారైంది. సిడ్నీలో గురువారం మొదలయ్యే మూడో టెస్టులో రోహిత్‌ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయమైంది. ఆతిథ్య బౌలర్లను ఎదుర్కోవడంలో తంటాలు పడుతున్న మయాంక్‌ అగర్వాల్‌ను సిడ్నీ టెస్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు..

‘క్యూ3’ సీజన్‌ వస్తోంది... ఐటీ మెరుపులు..!

భారత ఐటీ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (క్యూ3) ఫలితాలు అంచనాలను మించుతాయని విశ్లేషకులు అంటున్నారు.  ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ క్యూ3 ఫలితాలు ఇవే కావచ్చని వారంటున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలకు క్యూ3 సీజన్‌ బలహీనమైనది.  అయితే ఈసారి మాత్రం ఐటీ కంపెనీలు క్యూ3 ఫలితాల్లో దుమ్ము రేపుతాయని, కంపెనీల ఆదాయం జోరుగానే వృద్ధి చెందగల అవకాశాలున్నాయంటున్న విశ్లేషకుల అభిప్రాయాలపై.. పూర్తి వివరాలు..

ఈ సెల్యూట్‌ అందరం గర్వపడే సెల్యూట్

మూడు రోజుల క్రితం తిరుపతిలో ఒక స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. అక్కడ జరగనున్న పోలీస్‌ డ్యూటీ మీట్‌కు గుంటూరు అర్బన్‌ సౌత్‌ డిఎస్పీ వై.జెస్సి ప్రశాంతి హాజరయ్యారు. తిరుపతిలో కల్యాణిడ్యామ్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సి.ఐ వై.శ్యామ్‌సుందర్‌ కూడా హాజరయ్యారు. పోలీసు విభాగంలో పై అధికారి కనిపిస్తే కింది అధికారి సెల్యూట్‌ చేయాలి. పూర్తి వివరాలు..

పీఆర్సీపై సీఎం కసరత్తు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు. సీఆర్‌ బిస్వాల్‌ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గత నెల 31న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు పీఆర్సీ నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు