టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

25 Dec, 2020 17:31 IST|Sakshi

బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మె‍ల్యేలు
జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఊహించని షాక్‌ ఇచ్చారు. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు జేడీయూ శాసనసభ్యులు అధికార బీజేపీలో చేరారు. . ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ అధికార ప్రకటన చేశారు. పూర్తి వివరాలు..

నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్‌
సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తానని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలోనే  ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం జగన్‌ తెలిపారు. పూర్తి వివరాలు..

ఆపిల్ బ్లూటిక్‌ను ఫేస్‌బుక్ తొలగించిందా?
ఆపిల్ తన ఐఫోన్ మొబైల్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్స్, నిబంధనలు తీసుకొచ్చినప్పటి నుండి ఫేస్‌బుక్ ఆపిల్ కొత్త విధానాలను వ్యతిరేకిస్తుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఆపిల్ తన కొత్త విధానాలతో చిన్న వ్యాపారాలకు ఆటంకం కలిగిస్తోందని పేర్కొంది. ఈ నిబంధనల విషయంలో మాత్రం ఆపిల్ తనను తాను సమర్థించుకుంది. పూర్తి వివరాలు..

21 ఏళ్లకే విజయం‌.. దేశంలో తొలి మేయర్‌
ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫంట్‌ (ఎల్డీఎఫ్‌) విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 941 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 516పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరేసి పూర్తి ఆధిక్యతను కనబర్చింది. పూర్తి వివరాలు..

సీఐపై కిరోసిన్‌ దాడి.. హత్యాయత్నం కేసు నమోదు
జవహర్‌నగర్‌ ఘటనలో పలువురిపై కేసు నమోదైంది. సీఐ భిక్షపతి, కానిస్టేబుల్‌ అరుణ్‌పై కిరోసిన్‌ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు..

రేవంత్‌కన్నా నాకే క్రేజ్‌ ఎక్కువ ఉంది..
తెలంగాణ పీసీసీ అధ్యక్ష‌ పదవిని ఎవరిని వరిస్తుందనే దానిపై కాంగ్రెస్‌ పార్టీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్లు హస్తిన వేదికగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ముందువరుసలో ఉన్నారు. పూర్తి వివరాలు.. 

బుల్లి అభిమాని కల నెరవేర్చిన బన్నీ
క్రిస్మస్‌ పర్వదినం రోజు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన వీరాభిమాని కల నెరవేర్చడంతోపాటు అనాథబాలల్లో సంతోషాన్ని నింపారు. తన బుల్లి వీరాభిమానికి ఆయన ఆటోగ్రాఫ్‌ పంపించడంతో  ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ వితిక షేరు అభ్యర్థన మేరకు ఆటో గ్రాఫ్‌తోపాటు, శాంటా బహుమతులను పిల్లలకు పంపించారు బన్నీ. పూర్తి వివరాలు.. 

కోహ్లిని క్షమాపణ కోరాను: రహానే
అడిలైడ్‌ టెస్టు మ్యాచ్‌ ముగిసిన తర్వాత తాను విరాట్‌ కోహ్లిని క్షమాపణ కోరినట్లు అజింక్య రహానే తెలిపాడు. ఇందుకు అతడు సానుకూలంగా స్పందించాడని పేర్కొన్నాడు. అయితే రనౌట్‌ తర్వాత మ్యాచ్‌ మొత్తం ఆస్ట్రేలియాకు అనుకూలంగా మారిందని విచారం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాలు..

రిలయన్స్ మరో డీల్‌
వ్యాపారవేత్త, బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ మరో డీల్‌ కుదుర్చుకున్నారు.  అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) సింగపూర్  కుచెందిన  స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ జాయింట్ వెంచర్  ఐఎమ్‌జీ వరల్డ్‌వైడ్ ఎల్‌ఎల్‌సీలో మేజర్‌ వాటాను కొనుగోలు చేశారు.  రూ .52.08 కోట్లకు  'ఐఎంజీ-ఆర్‌'ను సొంతం చేసుకొంది. పూర్తి వివరాలు.. 

‘సోలో బ్రతుకే సో బెటర్‌’మూవీ రివ్యూ
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సాయి తేజ్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న  ఈ యంగ్ హీరో తరువాత తడబడ్డాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి తేజ్‌‘చిత్రలహరి’,‘ప్రతిరోజూ పండుగే’ సినిమాలతో సూపర్‌ హిట్‌ కొట్టాడు. పూర్తి వివరాలు.. 

మరిన్ని వార్తలు