చిన్నారుల కరోనా సందేహాలు తీర్చే ‘టోల్‌ ఫ్రీ’

11 Oct, 2020 04:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

1800–121–2830కు ఫోన్‌ చేస్తే నిపుణుల సమాధానం  

సాక్షి, అమరావతి: చిన్నారుల్లో కరోనా సందేహాలను నివృత్తి చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసినట్టు బాలల సంక్షేమం, సంస్కరణల సేవలు, వీధి బాలలు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్‌ కృతికాశుక్లా చెప్పారు. కరోనా బారిన పడుతున్న చిన్నారులకు తగిన భరోసాను కల్పిస్తూ జాతీయ బాలల హక్కుల కమిషన్‌ 1800–121  2830 పేరిట టో ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. దీనికి ఫోన్‌ చేస్తే నిపుణులైన కౌన్సెలర్లు, మానసికతత్వ శాస్త్ర నిపుణులు చిన్నారుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు సహకరిస్తారని చెప్పారు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం మూడు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ టోల్‌ ఫ్రీలో అందుబాటులో ఉంటుందన్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ సైన్స్, న్యూరో సైన్సెస్‌ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్టు డాక్టర్‌ కృతికా శుక్లా వివరించారు.    

మరిన్ని వార్తలు