Trending News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

31 May, 2022 17:03 IST|Sakshi

1. ‘చంద్రబాబుకి బీసీల ఓట్లు కావాలి.. కానీ వాళ్లు ఎదిగితే ఓర్వలేరు’

చంద్రబాబు బీసీల ద్రోహి అని బీసీ నేత, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. సీఎం జగన్‌ బీసీలను అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఈ దేశంలో ఎవ్వరూ సీఎం జగన్‌లా బీసీలకు మేలు చేయలేదని.. 47 ఏళ్లలో బీసీలను ఇంతలా ప్రోత్సహించే సీఎంను చూడలేదని ఆయన అన్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి: మంత్రి పెద్దిరెడ్డి

అనంతపురంలో సామాజిక న్యాయభేరి సభ విజయవంతమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సామాజిక న్యాయభేరి సభకు మహానాడుకి మించి ప్రజలు వచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గత ఎన్నికలకు మించి సీట్లు వస్తాయన్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. రైతుల ఖాతాలోకి నగదు జమ చేసిన ప్రధాని మోదీ

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకంలో భాగంగా.. 11వ విడత నిధుల్ని నేడు విడుదల చేశారు. మంగళవారం గరిబ్‌ కళ్యాణ్‌ సమ్మేళనం కోసం ప్రధాని మోదీ షిమ్లాకు వెళ్లారు. ఈ వేదికగానే ఆయన రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. టాటాలకే కాదు బిర్లాలకు ఉంది ఓ కారు.. ఇప్పుడది దూసుకొస్తోంది

ఒకప్పుడు ఇండియన్‌ రోడ్లపై రారాజుగా వెలిగిన అంబాసిడర్‌ కారు మార్కెట్‌లోకి వస్తోంది. అది కూడా కొత్త రూపులో కొత్త టెక్నాలజీతో అనే వార్తలు బయటకు రావడం ఆలస్యం అందరి దృష్టి అంబాసిడర్‌ మీదే పడింది. సామాన్యులు మొదలు ఇండస్ట్రియలిస్టుల వరకు అంబాసిడర్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. జో బైడెన్‌ వార్నింగ్‌ బేఖాతరు.. చైనా కవ్వింపు చర్యలు


తైవాన్‌ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొద్దిరోజుల క్రితం చైనాను హెచ్చరించిన విషయం తెలిసిందే. తైవాన్‌లో చైనా ఆక్రమణకు పాల్పడితే డ్రాగన్‌ కంట్రీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని బైడెన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మంకీపాక్స్‌ ఎవరికైనా సోకవచ్చు!

మంకీపాక్స్‌ ముప్పుపై మరోసారి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగానే ఉన్నా.. తక్కువ కేసులు నమోదు అవుతున్నా జాగ్రత్తలు మాత్రం పాటించాలని కోరింది. అదే టైంలో కరోనా తరహాలో మంకీపాక్స్‌  మహమ్మారిగా  మారిపోయే అవకాశం తక్కువని స్పష్టత ఇచ్చింది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.విశాఖలో రణ్‌బీర్‌, జక్కన్న సందడి

బాలీవుడ్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. సెప్టెంబర్‌ 9న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రణ్‌బీర్‌ మంగళవారం వైజాగ్‌లో సందడి చేశాడు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8.మాట తప్పావ్‌ ఎలాన్‌మస్క్‌.. కానీ నువ్వు కార్యసాధకుడివే..


టెస్లా కార్ల కంపెనీ సీఈవో, అంతరిక్షంలోకి కారెట్లు పంపే స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఫౌండర్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న ఎలాన్‌మస్క్‌కి నెటిజన్లు నిలదీస్తున్నారు. పదేళ్ల కిందట చెప్పిన మాటలు నీటి మీద మూటలు అయ్యాయంటున్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9.నేను మగాడినైనా బాగుండేది.. ఈ కడుపునొప్పి వల్ల: టెన్నిస్‌ ప్లేయర్‌ భావోద్వేగం

‘‘ఇది అమ్మాయిలకు సంబంధించిన విషయం. మొదటి రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. భరించలేని కడుపు నొప్పి. అయినా నేను గేమ్‌ ఆడాలనే ప్రయత్నిస్తాను. కానీ ఈరోజు అలా జరుగలేదు’’ అంటూ చైనా యువ టెన్నిస్‌ క్రీడాకారిణి జెంగ్‌ కిన్వెన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తాను పురుషుడినైనా బాగుండేదని ఉద్వేగానికి గురైంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఉస్మానియా ఆస్పత్రి: వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!

ఉస్మానియా ఆస్పత్రిలోని దారుణమైన పరిస్థితులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి మార్చురీలో దారుణం చోటు చేసుకుంది. శవం విషయంలో మార్చురీ  సిబ్బంది లంచం డిమాండ్‌ చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులపై జులుం కూడా ప్రదర్శించింది.  
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు