నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి

3 May, 2022 18:19 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూ టౌన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కుమార్‌పై సంతోష్‌ అనే వ్యక్తి దాడి చేశాడు. ట్రాఫిక్‌లో అతి వేగంగా వెళ్తున్న కారును కానిస్టేబుల్‌ కుమార్‌ అడ్డుకున్నాడు. సంతోష్‌ అనే వ్యక్తి కారుదిగి నా కారునే ఆపుతావా అంటూ కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. దీంతో టూటౌన్‌ పోలీసులు సంతోష్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

చదవండి: (కాలేజీ బస్సు డ్రైవర్‌తో ప్రేమ పెళ్లి.. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి..)

మరిన్ని వార్తలు