Vijayawada: రాష్ట్రపతి పర్యటన.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు 

4 Dec, 2022 09:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పర్యటన నేపథ్యంలో ఆదివారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా శనివారం పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోకి భారీ, గూడ్స్‌ వాహనాలను అనుమతించబోమని తెలిపారు.  మచిలీపట్న నుంచి విజయవాడకు వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కంకిపాడు వద్ద నిలిపివేస్తామన్నారు.  

►విశాఖపట్నం–హైదరాబాద్‌ రాకపోకలు సాగించే వాహనాలు హనుమాన్‌జంక్షన్, నూజివీడు, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మార్గాన్ని అనుసరించాలి. ఈ రహదారి ఆంక్షలు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటాయి.  
►విశాఖపట్నం–చెన్నైకు రాకపోకలు సాగించే వాహనాలు హనుమాన్‌జంక్షన్, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మార్గాన్ని అనుసరించాలి. ఈ ఆంక్షలు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అమలులో ఉంటాయి.  
►గుంటూరు – విశాఖపట్నంకు బుడంపాడు, పొన్నూరు, రేపల్లె, అవనిగడ్డ, హనుమాన్‌జంక్షన్‌ మీదుగారాకపోకలు సాగించాలి. ఈ ఆంక్షలు ఉదయం ఏడు నుంచి 10.30 గంటల వరకు అమలులో ఉంటాయి.  
►చెన్నై–హైదరాబాద్‌ మార్గంలో ప్రయాణించే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడకుడి, నార్కెట్‌పల్లి మీదుగా రాకపోకలు సాగించాలి. ఈ ఆంక్షలు ఉదయం ఏడు నుంచి 10.30 గంటల వరకు అమలులో ఉంటాయి. 

చదవండి: (సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్‌)

మరిన్ని వార్తలు