పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ

27 Jul, 2021 04:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్  లో పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఏపీ రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా ఉన్న కేఆర్‌ఎం కిషోర్‌ను లీగల్‌ మెట్రాలజీ కంట్రోలర్‌గా నియమిస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.

మైనార్టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్‌ను సెర్ప్‌ సీఈవోగా నియమించి చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డైరెక్టర్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మధ్యనే బదిలీ అయిన కొంతమంది ఐఏఎస్‌లను పరిపాలనా సౌలభ్యం కోసం తిరిగి పాతస్థానాలకే పంపించారు. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులిచ్చారు.  

>
మరిన్ని వార్తలు