టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు

8 May, 2022 10:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ‍్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు ఆదివారం బదిలీ అయ్యారు. ప్రభుత్వం టీటీడీ ఈవో జవహర్‌రెడ్డిని బదిలీ చేసింది. దీంతో ఆయన స్థానంలో టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఇక, జవహర్‌రెడ్డిని సీఎంవో ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. 

మరోవైపు.. బదిలీల అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎండీగా సత్యనారాయణ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్‌, యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా శారదా దేవీ బాధత్యలు తీసుకోనున్నారు. 

మరిన్ని వార్తలు