అంతర్వేది నూతన రథానికి ట్రయల్‌ రన్‌

25 Jan, 2021 04:53 IST|Sakshi
అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి కొత్త రథానికి ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్న భక్తులు

సిట్‌ విచారణతో ప్రతిపక్షాల కుట్రలు భగ్నమవుతున్నాయన్న మంత్రి చెల్లుబోయిన

సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పుణ్యక్షేత్రంలో నూతన రథానికి ఆదివారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రథాన్ని మలుపు తిప్పేందుకు అమర్చిన హైడ్రాలిక్‌ జాకీ సిస్టం, రథ చక్రాలకు అమర్చిన బ్రేక్‌ సిస్టంలను పరిశీలించేందుకు దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులు నిర్వహించిన ట్రయల్‌ రన్‌ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆలయాలపై దాడుల ఘటనలపై సిట్‌ విచారణ వేశాక ప్రతిపక్షాల కుట్రలు భగ్నమవుతున్నాయని చెప్పారు.

ఎవరెవరు కుట్రపూరిత ఆలోచనలో ఉన్నారు? ఆ కుట్రలు భగ్నమై ఎవరెవరు బయటపడుతున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఆలయాలపై దాడులు చేసినందుకు గాను ఫలితాన్ని అనుభవించే రోజు ప్రతిపక్షాలకు కచ్చితంగా వస్తుందని మంత్రి హెచ్చరించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణపై ప్రతిపక్ష నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారని, దీంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, ఏపీ మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ పాల్గొన్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు