శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు: టీటీడీ

25 Jul, 2021 17:35 IST|Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన చెన్నైకి రేవతి పద్మావతి ట్రావెల్స్‌పై కేసు నమోదైంది. రేవతి పద్మావతి ట్రావెల్స్‌ సంస్థపై టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు