టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు 

21 Jan, 2023 04:52 IST|Sakshi

హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక సమావేశంలో నిర్ణయం 

తిరుపతి అలిపిరి : టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి.

అనంతరం టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయా సమావేశాల్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను  చైర్మన్‌ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామస్తులకు భజన, కోలాటం సామగ్రి అందించాలని, మానవాళి శ్రేయస్సుకు యాగాలు, హోమాలు నిర్వహించాలని, ఎస్వీబీసీ తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు