టీటీడీ క్యాలెండర్లు, డైరీలు రెడీ

8 Dec, 2021 04:43 IST|Sakshi

టీటీడీ వెబ్‌సైట్, అమెజాన్‌లో బుకింగ్‌ సదుపాయం

తిరుమల: టీటీడీ ప్రచురించిన 2022వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను టీటీడీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లోనూ బుక్‌ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. టీటీడీ వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్‌’ను క్లిక్‌ చేసి డెబిట్‌ కార్డు లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపి వీటిని ఆర్డరు చేయవచ్చు. ఇలా బుక్‌ చేసుకున్న వారికి పోస్టులో వాటిని పంపిస్తారు. భక్తులు ఎన్ని క్యాలెండర్లు, డైరీలనైనా బుక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి ప్యాకింగ్, షిప్పింగ్‌ చార్జీలు అదనం. విదేశాల్లోని భక్తులకు ఈ సదుపాయం ఉంది.

ఇతర సమాచారం కోసం 0877–2264209 నంబరు ద్వారా ప్రచురణల విభాగం కార్యాలయాన్ని గానీ, 9963955585లో ప్రత్యేకాధికారిని గానీ సంప్రదించవచ్చు. 12 పేజీల క్యాలెండర్‌ రూ.130, పెద్ద డైరీ రూ.150, చిన్నడైరీ రూ.120, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్‌ రూ.75, శ్రీవారి పెద్ద క్యాలెండర్‌ రూ.20, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్‌ రూ.15, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్‌ రూ.15, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ రూ.30గా ధర నిర్ణయించారు. తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయ శాలల్లో కూడా క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, విశాఖ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబైలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. 

మరిన్ని వార్తలు