బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

13 Sep, 2023 05:06 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేస్తున్న టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, మంత్రి కొట్టు  సత్యనారాయణ, ఈవో ధర్మారెడ్డి   

సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కొట్టు సత్య­నారాయణ, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి బ్రహ్మో­త్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు.

మరిన్ని వార్తలు