దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ ఛైర్మన్‌ దంపతులు

10 Aug, 2021 08:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. వారికి ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న వైవీ సుబ్బారెడ్డి దంపతులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ ఛైర్మన్‌, ఈవో అందజేశారు.

మరిన్ని వార్తలు