ఎస్వీబీసీ..త్వరలోనే కన్నడ, హిందీ భాషల్లో కూడా

28 Sep, 2020 12:43 IST|Sakshi

సాక్షి, తిరుప‌తి : ఎస్వీబీసీ నూతన భవనాలకు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2007 లో ఎస్వీబీసీ కి రూపకల్పన చేశారని, ఆయ‌న అనుమ‌తితోనే ఏర్పాట్లు జ‌రిగాయ‌ని తెలిపారు. 2008 ఏప్రిల్ 7 న టెస్ట్ సిగ్నల్ నిర్వహించగా, అదే ఏడాది  జులైలో పూర్తి ప్రసారాలు ప్రారంభం అయ్యాయని గుర్తుచేశారు. తక్కువ కాలంలోనే  ఎస్వీబీసీ భక్తుల మన్నన్నలు పొందిందని, త‌ద‌నంత‌రం 2017లో తమిళ చానల్ కూడా ప్రారంభం అయిన‌ట్లు వెల్ల‌డించారు.

ఇక నూత‌న భవనాల్లో రెండు స్టూడియోలు , టేలి పోర్టులు  ఉన్నాయని తెలిపారు. ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ చానల్ గా ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం  భక్తుల నుంచి విరాళాలు కోరామని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 4 కోట్ల రూపాయలు రాగా, భక్తుల కోరిక మేరకు త్వరలోనే కన్నడ, హిందీ భాషల్లో కూడా చానళ్లు పెడుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎస్వీబీసీ ని పూర్తి హెచ్‌డి  చానల్ గా మార్చుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. (ఆమె జాతీయ నాయకురాలో లేక జాతి నాయకురాలో..)

మరిన్ని వార్తలు