పురాతన ఆలయాల అభివృద్ధికి టీటీడీ సహకారం

29 Aug, 2021 04:51 IST|Sakshi
భావనారాయణస్వామిని దర్శించుకుంటున్న వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు కన్నబాబు, వేణు తదితరులు

చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

కాకినాడ రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌లో పురాతన ఆలయాల పునరాభివృద్ధికి టీటీడీ తరఫున సహకారం అందిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ సర్పవరం గ్రామంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణస్వామి ఆలయాన్ని శనివారం ఆయన దర్శించుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ దంపతుల 25వ వివాహ మహోత్సవం సందర్భంగా వారి పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గోపూజలో పాల్గొన్నారు.

మీడియాతో వైవీ మాట్లాడుతూ.. భావనారాయణ స్వామి ఆలయం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ పరిధిలో ఉందని, వారి అనుమతులు తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలని భక్తులు, ఆలయ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు కోరగా, త్వరలోనే ఏర్పాటు చేస్తామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. వైవీకి ఆలయ విశిష్టతను చైర్మన్‌ పుల్ల శేషుకుమారి, కమిటీ సభ్యులు, అర్చకులు వివరించారు. కార్యక్రమంలో మంత్రి వేణు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు