తిరుమల: 19న వాచీల ఈ–వేలం

14 Aug, 2021 09:27 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీల ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈనెల 19న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్‌ ద్వారా ఈ–వేలం వేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్‌ కంపెనీలకు చెందిన వాచీలు మొత్తం 38 లాట్లు ఉన్నట్లు తెలిపింది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయ పని వేళల్లో 0877–2264429 నంబర్‌లో గానీ,  www.tirumala.org రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ www.konugolu.ap.gov.in వెబ్‌సైట్‌లో గానీ సంప్రదించాలని కోరింది.  

మరిన్ని వార్తలు