‘తిరుమలలో భద్రతపై ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు’

23 Jan, 2023 15:08 IST|Sakshi

తిరుపతి: తిరుమలలో భద్రతపై ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీలో హై సెక్యూరిటీ వ్యవస్థ ఉందని, త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అందుబాఠులోకి వస్తుందన్నారు. తిరుమలలో డ్రోన్ల వ్యవహారంపై కేసు నమోదైన సంగతిని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్‌ ఆపరేటర్లు అత్యుత్సాహంతో వీడియోలో తీసుకుంటే చర్యలు చేపడతామన్నారు.

కాగా, టీటీడీ భద్రత సిబ్బంది కళ్లుగప్పి... ఓ డ్రోన్ స్వామి వారి ఆలయం పై చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది. స్వామి వారి ఆలయానికి సంబంధించినదంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.  సెక్యూరిటీ పరమైన ఆంక్షలు ఉండి.... స్వామి వారి ఏరియల్ వ్యూ ను బయటకు రాకుండా చూసుకుంటుంది టీటీడీ. అయితే ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ చేసిన నిర్వాకం మాత్రం ఇప్పుడు కలకలం రేపుతోంది. 

చదవండి: తిరుమల: ‘అందుకే డ్రోన్లు ఎగురవేశారు!’

శ్రీవారి ఆలయం డ్రోన్ విజువల్స్‌పై టీటీడీ సీరియస్.. విచారణకు ఆదేశం

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు