ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు

17 Dec, 2020 19:14 IST|Sakshi

సాక్షి, తిరుపతి/చిత్తూరు : ఈ నెల 25 నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో జవహర్‌ రెడ్డి తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... ‘24వ తేదీ నుంచి స్థానికులకు టిక్కెట్లు కేటాయిస్తాం. రోజుకు ఏడువేల టిక్కెట్లు స్థానికులకు కేటాయింపు ఉంటుంది. అయితే స్వామివారి కల్యాణం టిక్కెట్లు ఉన్నవారికి డిసెంబర్‌  25, 26, జనవరి 1న దర్శనం ఉండదు. ఆ మూడురోజులు సిఫార్సు లేఖలు రద్దు చేశాం.

అదే విధంగా గోవింద మాల భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉండవు. 25వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్రారంభం అవుతాయి. సామాన్య భక్తులకు ఎనిమిది గంటల నుంచి  వైకుంఠ ఏకాదశి దర్శనం ప్రారంభం అవుతుంది’ అని తెలిపారు. కాగా శ్రీవారి దర్శనంలో తమకూ ప్రత్యేక కోటా కల్పించాలని మూడు దశాబ్దాలుగా స్థానికులు(చిత్తూరు జిల్లా) విజ్ఞప్తిని టీటీడీ ఆమోదించిన విషయం తెలిసిందే.(చదవండి: తిరుమల అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం)

మరిన్ని వార్తలు