నేడు సీసీఆర్‌ఏఎస్‌కు ఆనందయ్య మందు నివేదిక

26 May, 2021 10:26 IST|Sakshi

తిరుపతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 500 మంది నుంచి నివేదిక తయారు చేసింది. ఈ కమిటీ నేడు( బుధవారం) సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌(సీసీఆర్‌ఏఎస్‌)కు నివేదిక సమర్పించనుంది. మరో రెండ్రోజుల్లో సీసీఆర్‌ఏఎస్‌ నుంచి నిర్ణయం వెలువడనుంది. ఆనందయ్య మందు కోసం దేశ వ్యాప్తంగా ప్రజల ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అన్ని అనుకూలిస్తే ఈ నెలాఖరుకు ఆయుర్వేద మందును టీటీడీ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆనందయ్య కరోనాకు ఇచ్చిన ఆయుర్వేద మందును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయుష్‌ అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఆ మందు ఎటువంటి హానికర పదార్థం కాదని స్పష్టత వచ్చింది. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్, ఆయుష్‌శాఖల పరిశీలన తర్వాత ఆనందయ్య మందుకు అనుమతి వస్తే టీటీడీ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఫార్మసీలోనే ఈ ఔషధం తయారు చేయిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధన

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు