30 మందితో టీటీడీ పాలక మండలి

16 Sep, 2021 02:58 IST|Sakshi

ఇందులో నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) 30 మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ప్రభుత్వం బుధవారం నియమించింది. అధికారులతో కలిసి 28 మందిని పాలక మండలి సభ్యులుగా, మరో ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్‌ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 8వ తేదీనే టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కేవలం పాలక మండలి చైర్మను మాత్రమే ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించింది. చైర్మన్‌ సహా సభ్యుల పదవీ కాలం దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్‌ 99ను అనుసరించి ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఇద్దరికి పాలక మండలిలో ఓటు హక్కు ఉండదన్నారు. 

కొత్త పాలక మండలి ఇలా..
1. పొలకల అశోక్‌కుమార్, 2. మల్లాడి కృష్ణారావు
3.టంగుటూరు మారుతీ ప్రసాద్, 4. మన్నే జీవన్‌రెడ్డి, 5. డాక్టర్‌ బండి పార్థసారథిరెడ్డి, 6. జూపల్లి రామేశ్వరరావు, 7. ఎన్‌. శ్రీనివాసన్, 8. రాజేష్‌ శర్మ, 9. బోరా సౌరభ్, 10. మూరంశెట్టి రాములు, 11. కల్వకుర్తి విద్యాసాగర్, 12. ఏపీ నందకుమార్, 13. పచ్చిపాల సనత్‌కుమార్, 14. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, 15. డాక్టర్‌ కేతన్‌ దేశాయి, 16.బూదాటి లక్ష్మీనారాయణ, 17. మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్, 18. ఎంఎన్‌ శశిధర్, 19 అల్లూరి మల్లేశ్వరి
20. డాక్టర్‌ ఎస్‌.శంకర్, 21. ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌రెడ్డి, 22. బుర్రా మధుసూదన్‌యాదవ్, 23. కిలివేటి సంజీవయ్య, 24. కాటసాని రాంభూపాల్‌రెడ్డి 

ఎక్స్‌ అఫీషియో సభ్యులు 
1. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, 2. దేవదాయ శాఖ కమిషనర్, 3. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్, 4. టీటీడీ ఈవో
ప్రత్యేక ఆహ్వానితులు 
1. భూమన కరుణాకర్‌ రెడ్డి
2. సుధాకర్‌ (బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌)

ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మంది 
ఏపీ టూరిజం పాలసీలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా భవిష్యత్‌లో తిరుమల ఆలయానికి భక్తుల రాక పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా, ఇంకొక 50 మందిని టీటీడీ ఆలయ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్‌ మరో ఉత్తర్వు జారీ చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యుల పదవీ కాలం కొనసాగినంత కాలం ఆలయ ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ఉంటుందని.. పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్‌ వీరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు