దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ

14 Oct, 2021 17:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దసరా నవరాత్రుల సందర్భంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ అర్చకులు సారె సమర్పించారు. టీటీడీ అధికారులు, అర్చకులకు దుర్గగుడి ఆలయ ఈవో భ్రమరాంబ,ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు,అధికారులు స్వాగతం పలికారు. దసరా ఉత్సవాల్లో టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మహిషాసురమర్దినీదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను టీటీడీ బోర్డు మెంబర్లు దర్శించుకున్నారు.
చదవండి:
‘కట్టుకథలు.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’

మరిన్ని వార్తలు