అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం: టీటీడీ

31 Jul, 2021 17:36 IST|Sakshi

విమర్శకులపై మండిపడ్డ టీటీడీ పండితులు

సంస్కృతం, పురాణాలు తెలియనివాళ్లకు మాట్లాడేహక్కు లేదు

సాక్షి, తిరుపతి: అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని మరోసారి టీటీడీ పునరుద్ఘాటించింది. హనుమాన్ జన్మస్థలంపై టీటీడీ శనివారం మీడియా సమావేశంలో హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని పండితులు తేల్చి చెప్పారు. విమర్శకులపై టీటీడీ పండితులు మండిపడ్డారు. తమకు లభించిన ఆధారాలు, శాసనాల ప్రకారమే ప్రకటన  చేశామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

సంస్కృతం, పురాణాలు తెలియనివాళ్లకు మాట్లాడేహక్కు లేదన్నారు. ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే తమతో చర్చకు రావొచ్చని ఈవో తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో అంజనాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. అబద్ధాలను చెప్పాల్సిన అవసరం టీటీడీకి లేదని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు