తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ టికెట్ల కోటా విడుదల

29 Jun, 2021 20:10 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్ టికెట్ల కోటా టీటీడీ విడుదల చేసింది. జులై నెల‌కు కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకార‌ సేవల ఆన్‌లైన్ (వ‌ర్చువ‌ల్‌) టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు పొందిన భ‌క్తులు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా త‌మ ఇళ్ల నుండే వ‌ర్చువ‌ల్ విధానంలో ఈ సేవ‌ల్లో పాల్గొనాలని టీటీడీ పేర్కొంది. కల్యాణోత్సవం టికెట్లు పొందిన భక్తులకు ఏడాదిలో తమకు ఇష్టమైన రోజు దర్శనానికి వచ్చే అవకాశం టీటీడీ కల్పించింది.

చదవండి: ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ 
చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు: ఆళ్ల నాని

మరిన్ని వార్తలు